బీట్రూట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దీనితో మనకు తెలిసిన వంటకాలు చాలా తక్కువ. చాలామంది పిల్లలు కూడా దీన్ని తినడానికి మారాం చేస్తుంటారు. అందుకే ఇవాళ మీ ముందుకు బీట్రూట్ కట్లెట్స్ రెసిపీని తీసుకొస్తున్నాం.
ఈ కట్లెట్స్ను ఖచ్చితమ్గా పిల్లలూ, పెద్దలూ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని చూసి ట్రై చేయండి.

#betrootcutlets #vegrecipes #snacks

Here's the link to this recipe in English: https://bit.ly/2LJ9Ipy

తయారీకి కావలసిన సమయం: 20 నిమిషాలు
వండటానికి కావలసిన సమయం: 30 నిమిషాలు
సెర్వింగులు – 4 – 5

కావలసిన పదార్థాలు

బీట్రూట్ – 2
నూనె – 1 టేబుల్స్పూన్
తరిగిన జీడిపప్పులు
కిస్మిస్లు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు – 2 (చిన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – 1 /2 టీస్పూన్
గరం మసాలా – 1 /2 టీస్పూన్
చాట్ మసాలా – 1 టీస్పూన్
ఉడకపెట్టిన బంగాళాదుంప – 5
ఉడకపెట్టిన పచ్చి బఠాణీలు
తరిగిన కొత్తిమీర
మైదా – 2 టేబుల్స్పూన్లు
నీళ్లు
బ్రెడ్ పొడి
వేయించడానికి సరిపడా నూనె

తయారుచేసే విధానము

ముందుగా బీట్రూట్ను తురిమి పక్కన పెట్టుకోవాలి

ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి, కొన్ని జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేయించుకోవాలి

ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి

కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి

ఇప్పుడు తురిమిన బీట్రూట్ను వేసి అది మగ్గేంతవరకు వేయించాలి

ఉడికించిన బంగాళాదుంపలు వేసి మొత్తమంతా ఒకసరి మాష్ చేసుకోవాలి

మాష్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి మార్చుకుని కొత్తిమీర, బఠాణీలు వేసి కలుపుకోవాలి

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ప్యాటీస్లాగా తయారుచేసి పక్కన పెట్టుకోవాలి(కావాలంటే పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు)

ఇప్పుడు మైదాలో నీళ్లు కలిపి కొద్దిగా పలచటి పిండిని తయారుచేసుకోవాలి (ఇది మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు)

ఇప్పుడు ప్యాటీలను మైదా పిండి మిశ్రమంలో ముంచి తీసి, వెంటనే బ్రెడ్డు పొడిలో దొర్లించాలి(కావాలంటే ఇప్పుడు కూడా పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు)

ఒక పాన్లో నూనె వేసి ప్యాటీలను షాలో ఫ్రై చేసుకోవాలి

బీట్రూట్ కట్లెట్లను కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Telugu vantalu, Telugu recipes, Recipes in telugu, Cutlet recipes, cutlet, Beetroot cutlet, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here