బిర్యానీ అనేది ఒక అద్భుతమైన వంటకం. మరి ఇంత అద్భుతమైన వంటకాన్ని మన చేతుల్తో మనమే వండి మనవాళ్ళకి తినిపిస్తే అది ఎంతో తృప్తినిస్తుంది. అందుకే ఇవాళ మీకోసం ప్రెషర్ కుక్కర్లో వెజిటల్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ఈ రెసిపీని చూసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.

#vegbiryaniintelugu #biryanirecipes #vegbiryani

Here's the link to this recipe in English : https://bit.ly/2OwSpKj

తయారుచేయుటకు : 25 నిమిషాలు
వండుటకు : 40 నిమిషాలు
సెర్వింగులు : 4

కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం – 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
నెయ్యి – 3 టీస్పూన్
మసాలా దినుసులు – [దాల్చిన చెక్క, యాలకులు- 3 , అనాస పువ్వు – 1 , జాపత్రి, లవంగం, బిర్యానీ ఆకు, రాతి పువ్వు (ఆప్షనల్)]
ఉల్లిపాయలు – 2 (తరిగినవి)
నూనె – 2 టీస్పూన్
టొమాటోలు – 2 (తరిగినవి)
పసుపు – 1 / 4 టీస్పూన్
ఉప్పు
పెరుగు – 1 / 4 కప్పు
బంగాళాదుంప – 1 (పెద్ద)
క్యారెట్ – 1 (తరిగినది)
బీన్స్ – 7
క్యాలీఫ్లవర్
పచ్చి బఠాణీలు – 1 / 4 కప్పు
కొన్ని పుదీనా ఆకులు
కొత్తిమీర
నీళ్లు – 2 కప్పులు

మసాలా పేస్టు కోసం :

కాశ్మీరీ ఎండుమిర్చి – 3
పచ్చిమిరపకాయలు – 2
వెల్లుల్లి – 3 రెబ్బలు
చిన్న అల్లం ముక్క
తరిగిన ఉల్లిపాయ – 2 టీస్పూన్లు
కొన్ని పుదీనా ఆకులు
కొత్తిమీర
కొన్ని నీళ్లు

తయారుచేసే విధానము

ఒక కప్పు (250 మిల్లీలీటర్లు) బాస్మతి బియ్యాన్ని కడిగి, పదిహేను నిమిషాల పాటు నీళ్లలో నానపెట్టాలి

పదిహేను నిమిషాల తర్వాత నీళ్లను మాత్రమే వంపేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి

మసాలా పేస్టు కోసం ఒక మిక్సీలో మూడు ఎండుమిరపకాయలు, రెండు పచ్చిమిరపకాయలు, మూడు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, రెండు టీస్పూన్ల తరిగిన ఉల్లిపాయ,కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి, చివరగా కొన్ని నీళ్లు కూడా పోసి మెత్తటి పేస్టులాగా రుబ్బుకోవాలి

ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని వేడి చేసి అందులో మూడు టీస్పూన్ల నెయ్యి, దాల్చిన చెక్క, మూడు యాలకులు, ఒక అనాస పువ్వు, చిన్న జాపత్రి ముక్క, కొన్ని లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ముక్కంత రాతి పువ్వు వేసి వేయించాలి

ఇప్పుడు చిన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలను వేసి అవి బంగారు రంగులోకి మారేంతవరకు వేయించుకోవాలి

ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్టును కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి

గ్రేవీ మరీ డ్రైగా అనిపిస్తే రెండు టీస్పూన్ల నూనె వేసుకోవచ్చు

ఇప్పుడు తరిగిన రెండు టొమాటోలు కూడా వేసి అవి చక్కగా మగ్గేంతవరకు వేయించాలి

ఇందులో ఇప్పుడు పావు టీస్పూన్ పసుపు, తగినంత ఉప్పు, పావు కప్పు పెరుగు కూడా వేసుకోవాలి

తరిగిన ఒక పెద్ద బంగాళాదుంప, ఒక క్యారెట్, ఏడు బీన్స్, ఒక బౌల్ అంత క్యాలీఫ్లవర్ మరియు పావు కప్పు పచ్చి బఠాణీలు కూడా వేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి

మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేయాలి

ఇప్పుడు నానపెట్టిన బాస్మతి బియ్యం, రెండు కప్పుల నీళ్లు వేసి ఉప్పు తగ్గినట్లనిపిస్తే కొద్దిగా వేసుకోవాలి

ఇప్పుడు బిర్యానీని రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్కరును మీడియం ఫ్లేములో ఉంచి ఉడికించాలి

పొయ్యి కట్టేసి పదిహేను నిమిషాలపాటు ప్రెషర్ కుక్కర్లో బిర్యానీని మగ్గనివ్వాలి

పదిహేను నిమిషాల తర్వాత బిర్యానీని రైతాతో కానీ ఉల్లిపాయ సలాడుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Hema subramanian, Home cooking telugu, home cooking, Telugu vantalu, Recipes in telugu, Telugu recipes, biryani, Vegetable biryani, Vegetable biryani in telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here