మన అందరం సాధారణంగా పప్పును ఆకుకూరలతోనో, టొమాటోలతోనో, మామిడికాయతోనో, దోసకాయతోనో చేసుకుని తింటుంటాము. కానీ వంకాయతో పప్పు ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? కొత్తగా అనిపిస్తుంది కదూ! అందుకే ఇవాళ మీకోసం సరికొత్తగా వంకాయ పప్పు రెసిపీని మీముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియోను చూసి మీరు కూడా తప్పకుండా ఇంట్లో వంకాయ పప్పు ట్రై చేయండి. వేడి అన్నంలో ఇది చాలా రుచిగా ఉంటుంది.

#Brinjalpappu #Vankayapappu #Indianfood

Here's the link to this recipe in English: https://bit.ly/2LM4o2e

తయారుచేయుటకు : 5 నిమిషాలు
వండుటకు : 20 నిమిషాలు
సెర్వింగులు : 4

కావాల్సిన పదార్థాలు / Ingredients

కంది పప్పు – 100 మిల్లిలీటర్లు
ఉల్లిపాయ – 2 (తరిగినవి)
టొమాటో – 2 ( తరిగినవి)
పచ్చిమిరపకాయలు – 2 (చీల్చినవి)
నానపెట్టిన చింతపండు
వంకాయ – 1 / 4 కిలో
పసుపు – 1 /2 టీస్పూన్
ఎండుకారం – 2 టీస్పూన్లు
నీళ్లు
కల్లు ఉప్పు – 1 టీస్పూన్

తాలింపు కోసం కావలసినవి

నూనె – 1 టేబుల్స్పూన్
ఆవాలు – 1 / 4 టీస్పూన్
మినపప్పు – 1 / 4 టీస్పూన్
జీలకర్ర – 1 / 4 టీస్పూన్
ఎండుకారం – 2
దంచిన వెల్లుల్లి
ఇంగువ – 1 /4 టీస్పూన్
కొన్ని కరివేపాకులు

గార్నిష్ కోసం :

నెయ్యి
తరిగిన కొత్తిమీర

తయారుచేసే విధానం :

ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయ, నానపెట్టిన చింతపండు, వంకాయలు, పసుపు, ఎండుకారం, నీళ్లు, కల్లు ఉప్పు వేసి మూడు- నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి

ఇప్పుడు పప్పు, వంకాయలు ఉడికిపోయాయి కాబట్టి తాలింపు పెట్టుకోవాలి

ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి, అందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి

ఆవాలు చిటపటలాడిన తరువాత దంచిన వెల్లులి, ఇంగువ వేసుకోవాలి

ఇప్పుడు పొయ్యి కట్టేసి కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి

ఉడికించిన వంకాయ పప్పును తాలింపులో వేసి బాగా కలపాలి

ఉప్పు తగ్గిందనిపిస్తే కొద్దిగా వేసుకుని, తరిగిన కొత్తిమీర కూడా వేసి మొత్తం మరొకసారి కలుపుకోవాలి

ఇప్పుడు పప్పు పైన నెయ్యి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి

ఈ వంకాయ పప్పును వేడివేడిగా చపాతీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Home cooking telugu, Homecooking, Hema subramanian, Telugu vantalu, Recipes in telugu, Telugu recipes, Brinjal dal, Brinjal dal in telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here