బెంగాలీ స్వీట్స్లోనే చాలా ప్రత్యేకమైనది రసగుల్లా. రసగుల్లాలు అంటే అందరికి ఇష్టమే. అందుకే అలాంటి టేస్టీ స్వీట్ను ఇంట్లోనే తయారుచేసే విధానం మీకు చూపించడానికి ఈరోజు మీముందుకు రసగుల్లా రెసిపితో వస్తున్నాం. ఆలస్యం చేయకుండా ఈ రేసీపీని చూసి చకచకా తయారుచేసి మీ ఇంట్లో వారందరికీ తినిపించండి.

#Rasgulla #Sweets #Desserts

Here's the link to this recipe in English: https://bit.ly/35d6YbM

తయారుచేయుటకు: 60 నిమిషాలు
వండుటకు: 40 నిమిషాలు
సెర్వింగులు: 6 (తలకో రెండు చొప్పున)

కావలసిన పదార్థాలు

పాలు – 1 1 / 2 లీటర్లు
రెండు నిమ్మకాయల రసం
నీళ్లు

పంచదార పాకం చేయుటకు కావలసినవి

నీళ్లు – 5 కప్పులు
పంచదార – 2 కప్పులు
యాలకులు – 4
కేతకి నీరు (కెవ్రా వాటర్) – 1 / 2 టీస్పూన్

తయారుచేయు విధానము

ముందుగా ఒకటిన్నర లీటర్ల పాలను మరిగించుకోవాలి
మధ్యమధ్యలో పాలను గరిటతో తిప్పుతూ ఉండాలి
పాలు పూర్తిగా పొంగిన తరవాత, అందులో రెండు నిమ్మకాయల రసం పిండుకోవాలి
ఇప్పుడు పాలను ఒకసారి బాగా కలయపెట్టాలి
పాలు విరిగిన తరువాత అందులో నీరు మొత్తం పైకి తేలుతుంది
ఇప్పుడు పొయ్యి కట్టేసుకోవచ్చు
ఇప్పుడు విరిగిన పాలను ఒక పల్చటి గుడ్డలో వేసి వడకట్టుకోవాలి
ఇలా చేస్తే నీరు మొత్తం పోయి చెన్నా(పనీర్) మాత్రం మిగులుతుంది
ఇప్పుడు నిమ్మకాయ వాసన పోవడం కోసం చెన్నాని ఒకటికి రెండుసార్లు నీటితో కడగాలి
ఇప్పుడు చెన్నా ఉన్న పల్చటి గుడ్డని గట్టిగా కట్టి నీరు కారిపోడానికి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి
ఒక వెడల్పాటి గిన్నెలో చెన్నాని తీస్కుని ఉండలు లేకుండా ఉండేటట్టు పిసకాలి
చెన్నా బాగా మెత్తగా తయారయ్యేటట్టు పదిహేను నిమిషాల పాటు పిసుకుతూ ఉండాలి
ఇప్పుడు చెన్నాని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని వాటిపైన ఒక మూత ఉంచి పక్కన పెట్టేయాలి
ఒక గిన్నెలో ఐదు కప్పుల నీళ్లు తీస్కుని అందులో రెండు కప్పుల పంచదార వేసుకోవాలి
పంచదారను పూర్తిగా కరగనివ్వాలి
నాలుగు యాలకులను కాస్త దంచుకుని పంచదార పాకంలో వేసి ఒక మరుగు రానివ్వాలి
పంచదార పాకం కొద్దిగా మరిగిన తరువాత అర టీస్పూన్ కేతకి నీటిని (కెవ్రా వాటర్) కలుపుకోవాలి
ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి జాగ్రత్తగా చెన్నా ఉండలను పాకంలోకి వెయ్యాలి
పదిహేను నిమిషాల పాటు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి
రసగుల్లాలన్నీ పంచదార పాకాన్ని చక్కగా పీల్చుకుంటేటట్టు అన్ని వైపులా తిప్పాలి
పదిహేను నిమిషాల తరవాత రసగుల్లాలు పెద్దవి అవుతాయి
ఇప్పుడు పొయ్యి కట్టేసి రసగుల్లాలని చల్లార్చుకోవాలి
వీటిని ఉన్నపళంగా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు
రసగుల్లాలను ఫ్రిడ్జిలో ఉంచితే ఒక వారం రోజులపాటు నిలవుంటాయి

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Telugu vantalu, Recipes in telugu, Telugu recipes, Sweet recipes, sweet, Rasagulla in telugu, Rasgulla, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here