పనీర్ శాండ్విచ్ చాలా సులువుగా చేసుకోగలిగే ఒక స్నాక్. ఇది లంచ్ బాక్సులోకి కూడా చాలా బాగుంటుంది. ఈ శాండ్విచ్లను పిల్లలుకూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోని చూసి తెలుసుకోండి.

#paneersandwichrecipe #teluguvantalu #paneerrecipes

Here's the link to this recipe in English: https://bit.ly/321AChv

తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 5

కావలసిన పదార్థాలు

పనీర్ ఫిల్లింగ్ చేయడానికి కావలసినవి

పనీర్ – 400 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 3 (తరిగినవి)
పెద్ద ఉల్లిపాయ – 1 (తరిగినది)
పచ్చిమిరపకాయలు – 3 (తరిగినవి)
చిన్న కాప్సికం – 1 (తరిగినది)
ఉప్పు – 1 టీస్పూన్
కాశ్మీరీ ఎండుకారం – 1 టీస్పూన్
గరం మసాలా – 1 టీస్పూన్
ఆంచూర్ పొడి – 1 టీస్పూన్
చాట్ మసాలా – 1 టీస్పూన్
కొత్తిమీర – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – 1 టీస్పూన్
కొత్తిమీర

పుదీనా చట్నీ చేయడానికి కావలసినవి

కొత్తిమీర
పుదీనా ఆకులు
పచ్చిమిరపకాయలు – 2
వెల్లుల్లి రెబ్బలు – 2
అల్లం – 1 చిన్న ముక్క
చిన్న ఉల్లిపాయ – 1 (తరిగినది)
అరచెక్క నిమ్మరసం
ఉప్పు – 1 టీస్పూన్

పనీర్ శాండ్విచ్ చేయడానికి కావలసినవి

బ్రెడ్ స్లైసులు
వెన్న
పుదీనా చట్నీ
పనీర్ ఫిల్లింగ్

తయారుచేయు విధానం

ఒక పాన్లో కొద్దిగా నూనె, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేయించాలి

ఇప్పుడు కాప్సికం వేసి వేయించుకోవాలి

ఇప్పుడు ఉప్పు, ఎండుకారం, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అంతా కలుపుకోవాలి

వీటిని వేయించిన తరువాత కట్ చేసుకున్న పనీర్ ముక్కలను వేసి ఒక ఐదు నిమిషాలపాటు వేయించాలి

ఇప్పుడొక బ్రెడ్ స్లైస్ తీసుకుని వెన్న రాసి, పుదీనా చట్నీ రాసి, పనీర్ ఫిల్లింగ్ను పెట్టిన తరువాత చీజ్ తురుముకోవాలి

దీనిపైన వెన్న, పుదీనా చట్నీ రాసుకున్న ఇంకొక బ్రెడ్ స్లైసును పెట్టి కొద్దిగా ఒత్తాలి

ఇప్పుడొక గ్రిల్ పాన్ తీసుకుని దాని మీద వెన్న రాసి, శాండ్విచ్ను పెట్టుకోవాలి

శాండ్విచ్ పైనవైపున కూడా వెన్న రాసి శాండ్విచ్ను గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు గ్రిల్ చేసుకోవాలి

ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Hema subramanian, Home cooking telugu, home cooking, Telugu vantalu, Telugu recipes, Recipes in telugu, Paneer recipes, Paneer sandwich, Paneer sandwich in telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here