పనీర్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పనీర్ బటర్ మసాలా. రెస్టారెంట్సులో ఇది చాలా కమ్మగా రిచ్ టేస్ట్ను కలిగి ఉంటుంది. అదే రకంగా వచ్చేట్టుగా పనీర్ బటర్ మసాలాను ఇంట్లో ఎలా చాలా సులువుగా తయారుచేసుకొవాలో ఇవాళ మేము చూపించబోతున్నాము. ఈ రెసిపీని చూసి మీరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#paneerbuttermasala #teluguvantalu #paneermakhani

Here's the link to this recipe in English: https://bit.ly/2BvJ25I

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 45 నిమిషాలు
సెర్వింగులు: 4 – 5

కావలసిన పదార్థాలు

పనీర్ – 300 గ్రాములు
నూనె – 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయలు – 2 (తరిగినవి)
ఎండుమిరపకాయలు – 10
టొమాటోలు – 3 (తరిగినవి)
జీడిపప్పులు – 1/4 కప్పు
నెయ్యి – 3 టీస్పూన్లు
కాశ్మీరీ ఎండుకారం – 2 టీస్పూన్లు
గరం మసాలా – 1 టీస్పూన్
కసూరి మేథీ
కొత్తిమీర
పచ్చికోవా – 50 గ్రాములు
పాలు – 3 టేబుల్స్పూన్లు
ఫ్రెష్ క్రీం – 2 టేబుల్స్పూన్లు
పంచదార – 1 టీస్పూన్
నీళ్లు
రుచికి సరిపడా ఉప్పు

తయారుచేయు విధానం:

ఒక బాండీలో నూనె వేసి వేడి చేసుకుని, అందులో ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, టొమాటోలు, జీడిపప్పులు వేసి అవి బాగా మగ్గేంతవరకు వేయించుకోవాలి

కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసుకుంటే పదార్థాలన్నీ త్వరగా మగ్గుతాయి

ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని చల్లార్చుకుని మిక్సీలో వేసి మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి

ఒక బాండీ తీసుకుని కొద్దిగా నెయ్యి, ఎండుకారం వేసి లైట్గా వేయించుకోవాలి

ఇప్పుడు రుబ్బుకున్న మసాలా పేస్టు, గరం మసాలా పొడి, ఉప్పు, కొత్తిమీర, కసూరి మేథీ కూడా వేసుకోవాలి

పొయ్యిని 10 నిమిషాలపాటు లో-ఫ్లేములో ఉంచాలి

ఇప్పుడు ఫ్రెష్ క్రీం, పచ్చికోవాని మిక్సీలో వేసి, కొద్దిగా పాలను కూడా వేసి మెత్తటి పేస్టు చేసుకుని, ఈ మిశ్రమాన్ని బాండీలో వేసి బాగా కలుపుకోవాలి

ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన పనీర్నువేసి రెండు నిమిషాలపాటు కలయపెట్టాలి

ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని పైన వెన్న వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Hema subramanian, Home cooking telugu, home cooking, Paneer recipes in telugu, Paneer recipes, Paneer butter masala, Paneer butter masala in telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here