మనలో చాలా మందికి మటన్ లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టం. లేదంటే ఎప్పుడోకప్పుడు కచ్చితంగా తినే ఉండుంటాము. కానీ చికెన్ లివర్తో ఫ్రై ఎప్పుడైనా ట్రై చేసారా? మటన్ లివర్ ఫ్రైకి సమానంగా, అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా తినాలని అనిపిస్తుంది కదూ! అందుకే మీ ముందుకి ఈ రెసిపీని ఈరోజు తీస్కుని వస్తున్నాం. రెసిపీని చూసి, ట్రై చేసి, ఎంజాయ్ చేయండి.

Here's the link to this recipe in English: https://bit.ly/2uKmqeL

తయారు చేయుటకు : 5 నిమిషాలు
వండుటకు : 15 నిమిషాలు
సెర్వింగులు – 3

#chickenliverfry #చికెన్ లివర్ ఫ్రై #liverfry #chickenrecipes

కావలసిన పదార్థాలు

చికెన్ లివర్ – 200 గ్రాములు
పసుపు – 1/4 టీస్పూన్
కారము – 2 టీస్పూనులు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
నూనె
కరివేపాకులు

తయారు చేసుకునే విధానము :

చికెన్ లివర్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

కట్ చేసుకున్న ముక్కలలో పైన చెప్పిన మోతాదులో పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు వేసి ఇరవై నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి (ఊరబెట్టుకోవాలి).

ఒక బాండీలో నూనె కాస్త వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడిగా కాగిన తరువాత ఒక గుప్పెడు కరివేపాకులను వేసి కొద్దిగా ఫ్రై చేసిన తరువాత, మ్యారినేట్ చేసిన చికెన్ లివర్ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి.

ఒక పది నిమిషాల పాటు బాండీని చిన్నసెగ మీద ఉంచితే చికెన్ లివర్ ముక్కలు చక్కగా మగ్గుతాయి.

చికెన్ లివర్ ముక్కలు కాస్త బంగారు వర్ణంలోకి మారిన తరువాత వడ్డించుకుని తినడానికి రెడీ అయినట్లే.

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Chicken fry recipe in telugu, Liver fry, Chicekn recipes, Recipes in telugu, Telugu recipes, Chicken recipe in telugu, Chicken recipe, Chicekn fry, Chicken liver fry, Telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here