చికెన్ ఫ్రై అంటే నాన్-వెజ్ తినే వారందరికీ ఇష్టమే. అందుకే ఇవాళ మీకోసం రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీని చూసి తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి

#Chickenfryintelugu #Chickenrecipes #Chicken

Here's the link to this recipe in English: https://bit.ly/2MmRbhY

తయారుచేయడానికి : 45 నిమిషాలు
వండటానికి : 20 నిమిషాలు
సెర్వింగులు : 4-5 మందికి

కావలసిన పదార్థాలు

చికెన్ – 1 కిలో
ఒక నిమ్మకాయ రసం
పెరుగు – 2 టీస్పూన్లు
ఉప్పు – 1 టీస్పూన్
పసుపు – 1 / 4 టీస్పూన్
జీలకర్రపొడి – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
చాట్ మసాలా – 1 /2 టీస్పూన్
గరం మసాలా – 1 టీస్పూన్
ఎండుకారం – 2 టీస్పూన్
కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్స్పూన్
సెనగపిండి – 2 టేబుల్స్పూన్లు
వేయించడానికి సరిపడా నూనె

మసాలా పేస్ట్ చేయడానికి కావాల్సినవి

ఉల్లిపాయ – 1 (తరిగిన)
వెల్లుల్లి – 5 రెబ్బలు
అల్లం
పచ్చిమిరపకాయలు – 1

తయారుచేయు విధానము

మసాలా పేస్ట్ తయారుచేయడానికి :

ఒక మిక్సీలో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయ వేసి మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి

చికెన్ని మ్యారినేట్ చేయడానికి మరియు వేయించుకోడానికి :

ముందుగా చికెన్కు మసాలా అంతా బాగా పట్టడానికి గాట్లు పెట్టుకోవాలి

ఇప్పుడు గాట్లు పెట్టిన చికెన్ పైన ఉప్పు, నిమ్మరసం, పెరుగు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, ఎండుకారం, సెనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసి చికెన్లో కలపాలి

చికెన్ ముక్కలకు మసాలా అన్నివైపులా పట్టిన తరువాత లైట్గా మసాజ్ చేసి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి

ముప్పై నిమిషాల తరువాత మళ్ళీ చికెన్ ముక్కలను కొద్దిగా కలుపుకోవాలి

ఇప్పుడు బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి కొద్దిగా మరిగించిన తరువాత మీడియం-లో ఫ్లేములో ఉంచి చికెన్ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి

కొద్దిగా వేగిన తరువాత చికెన్ ముక్కలను బయటకు తీసి ఒక గిన్నెలో వేసుకుని మూత పెట్టేయాలి

ఇప్పుడు చికెన్ ముక్కలు కొద్దిగా చల్లారిన తరువాత మళ్ళీ నూనెను వేడి చేసుకుని హై ఫ్లేములో ఉంచి చికెన్ ముక్కలను ముప్పై సెకన్ల పాటు మళ్ళీ వేయించుకోవాలి
ఇప్పుడు చికెన్ ముక్కలను వేడివేడిగా స్టార్టర్లాగా సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Chicken recipe in telugu, Chicken recipes, Chicken Fry, Telugu vantalu, Recipes in telugu, Telugu recipes, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here