కాప్సికం పొడి కూర చాలా సులువుగా చేసుకోగలిగే ఒక వంటకం. ఇది చపాతీలు లేదా అన్నంలోకి చాలా బాగుంటుంది. లాంచిబాక్సులోకి తీసుకెళ్లడానికి ఇంకా బాగుంటుంది. చకచకా తయారుచేసుకోగలిగే ఈ కూరను ఈరోజు ఎలా చేయాలో చూసి మీరు కూడా ట్రై చేయండి.

#capsicumrecipes #capsicumpodikura #curryrecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2IBBkec

తయారుచేయుటకు : 5 నిమిషాలు
వండుటకు : 20 నిమిషాలు
సెర్వింగులు : 2

కావలసిన పదార్థాలు

సెనగపిండి – 1/2 కప్పు
నూనె – 3 టీస్పూన్లు
ఆవాలు – 1/2 టీస్పూన్
జీలకర్ర – 1/2 టీస్పూన్
ఉల్లిపాయ – 1 ( తరిగినది)
వెల్లుల్లి – 4 (తరిగినవి)
పచ్చిమిరపకాయలు – 2 (తరిగినవి)
ఇంగువ – 1 4 టీస్పూన్
కాప్సికం – 2
నీళ్లు
పసుపు – 1/4 టీస్పూన్
ఎండుకారం – 1/2 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
నిమ్మకాయ
కొత్తిమీర

తయారుచేసే విధానము

ముందుగా ఒక ప్యాన్లో అరకప్పు సెనగపిండిని నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి.సెనగపిండి కొద్దిగా రంగు మారిన తరువాత పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీ తీస్కుని మూడు టీస్పూన్ల నూనె వేసుకోవాలి.అందులో అర టీస్పూన్ జీలకర్ర, తరిగిన ఒక ఉల్లిపాయ, తరిగిన 4 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన రెండు పచ్చిమిరపకాయలు, పావు టీస్పూన్ ఇంగువ వేసి ఏడెనిమిది నిమిషాల పాటు చిన్నమంట మీద వేయించుకోవాలి

ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిన తరువాత తరిగిన రెండు క్యాప్సికములను కూడా వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి

ఇప్పుడు పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఎండుకారం, ఒక టీస్పూన్ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు కూడా పోయాలి

ఇప్పుడు మూత పెట్టి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేములో ఉంచి కూరను బాగా మగ్గనివ్వాలి

ఇప్పుడు పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి రోస్ట్ చేసిన సెనగపిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి (మొత్తం సెనగపిండి ఒకేసారి వేస్తే కూర ముద్దగా అయిపోతుంది)

ఇప్పుడు ఫ్లేమును మీడియంకు పెంచి సెనగపిండి అంతా కాప్సికంకు పట్టేట్టు చూసుకోవాలి

రుచి చూసి ఉప్పు తగ్గినట్లనిపిస్తే ఇప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు

ఇప్పుడు అరచెక్క నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి

కాప్సికం పొడి కూర రెడీ అయిపోయినట్టే

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Hema subramanian, Home cooking telugu, home cooking, Telugu vanta, Telugu recipes, Recipe in telugu, Sabji recipe in telugu, Capsicum sabji, Capsicum sabji in telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here