తెలుగు వారందరికీ ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇవాళ చాలా స్పెషల్‌గా ఉండే ఆవకాయ చికెన్ బిర్యాని రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకటేరకంగా కాకుండా కొత్త రకమైన బిర్యానీని ట్రై చేయాలనిపించినప్పుడు ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.

#avakaichickenbiryani #teluguvantalu #biryanirecipes

Here's the link to this recipe in English: https://bit.ly/2QxdHbu

తయారుచేయడానికి: 30 నిమిషాలు
వండటానికి: 1 గంట
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం – 500 గ్రాములు
నీళ్లు
నెయ్యి – 2 టేబుల్‌స్పూన్లు
నూనె – 1 టేబుల్‌స్పూన్
బిర్యానీ ఆకులు – 2
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయలు, జాపత్రి, అనాస పువ్వు, రాతి పువ్వు)
ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు – 2 (మధ్యలోకి చీల్చినవి)
అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీస్పూన్లు
టొమాటోలు – 2 (తరిగినవి)
పసుపు – 1/4 టీస్పూన్
ఎండుకారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
ఆవకాయ పచ్చడి – 3 టేబుల్‌స్పూన్లు
పుదీనా ఆకులు
కొత్తిమీర
నీళ్లు – 2 1/2 కప్పులు
ఉప్పు – 1 టీస్పూన్
నెయ్యి – 1 టేబుల్‌స్పూన్

చికెన్‌ను మ్యారినేట్ చేయడానికి కావలసినవి
చికెన్ – 1 కిలో
పసుపు – 1/2 టీస్పూన్
ఎండుకారం – 2 టీస్పూన్లు
ఉప్పు – 1 టీస్పూన్

తయారుచేసే విధానం

ఒక ప్రెషర్ కుక్కరులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి

ఇందులో మసాలా దినుసులు వేసి అవి మంచి సువాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి

ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి రంగు మారేంత వరకూ వేయించుకోవాలి

ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొద్దిగా వేయించిన తరువాత టొమాటోలు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి వేయించుకోవాలి

ఇందులో పసుపు, ఎండుకారం, చికెన్ ముక్కలు వేసి చికెన్ ముక్కలు రంగు మారేంతవరకూ వేయించుకోవాలి

ఇప్పుడు ఆవకాయ్ పచ్చడి వేసి, కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసి, సరిపడా నీళ్లు పోసుకోవాలి

ఇందులో నానపెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి

ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్రెషర్ కుక్కరులో ఉడికించిన తరువాత వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK – https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – https://www.instagram.com/homecookingshow

A Ventuno Production : http://www.ventunotech.com
Peoples are using these keywords: Telugu vantalu, Hema subramanian, Home cooking telugu, home cooking, Biryani recipe in telugu, biryani, Chicken biryani, Avakai chicken biryani, Avakai chicken biryani in telugu, Telugu

You might also like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here